ఆన్‌లైన్‌లో లిక్కర్ సేల్స్… సూపర్ చీటింగ్‌తో జేబులు లూఠీ

ఆన్ లైన్‌లో మద్యం అమ్మకాలంటూ దారుణంగా మోసం చేసిన ఉదంతమొకటి వెలుగు చూసింది. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్ కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో లిక్కర్ సేల్స్... సూపర్ చీటింగ్‌తో జేబులు లూఠీ
Follow us

|

Updated on: Apr 14, 2020 | 2:45 PM

ఆన్ లైన్‌లో మద్యం అమ్మకాలంటూ దారుణంగా మోసం చేసిన ఉదంతమొకటి వెలుగు చూసింది. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్ కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన బగ్గా వైన్స్ పేరిట జరిగిన ఆన్ లైన్ మోసాన్ని సిటీ పోలీసులు ఛేదించారు. బగ్గా వైన్స్ పేరుతో క్యూఆర్ కోడ్ పంపించి, దానికి అమౌంట్ పంపిస్తే అర్ధగంటలో మందు తమ ఇంటికి పంపిస్తామంటూ కేటుగాళ్ళు మోసాలకు పాల్పడ్డారు.

హైదరాబాద్ కోఠీ-సుల్తాన్ బజార్‌కు చెందిన అరవింద్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిశోధించారు. ఆన్ లైన్‌లో మొదట 1600 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసిన అరవింద్.. ఆ మొత్తానికి వచ్చే బ్రాండ్స్ లేవని చెప్పడంతో మరింత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. బల్క్‌లో మద్యం బాటిళ్ళు పంపిస్తామంటూ ఆశ చూపడంతో అరవింద్ సుమారు 92 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

పలుమార్లు ఓటీపీ నెంబర్ అడిగిన చీటర్స్… ఆ తర్వాత మొత్తం 92 వేల రూపాయలు డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత ఎంత సేపటికి మద్యం ఇంటికి రాకపోవడంతో అరవింద్ ఖంగారు పడి… వారికి కాల్ చేశాడు. ఎన్ని మార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ రాకపోవడంతో ఆందోళన చెంది, తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.