త్వరలో దేశంలో కామన్ సివిల్ కోడ్.. బాంబు పేల్చిన బండి

త్వరలో దేశంలో కామన్ సివిల్ కోడ్.. బాంబు పేల్చిన బండి

దేశవ్యాప్తంగా త్వరలోనే కామల్ సివిల్ కోడ్ అమల్లోకి తెచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందంటున్నారు తెలంగాన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు..

Rajesh Sharma

|

Apr 14, 2020 | 10:15 PM

దేశవ్యాప్తంగా త్వరలోనే కామల్ సివిల్ కోడ్ అమల్లోకి తెచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందంటున్నారు తెలంగాన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. అంబేద్కర్ ప్రవచించిన పలు అంశాలను బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారాయన.

భాజపా నినాదం, విధానం అన్ని కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఉంటాయని, అంబేద్కర్ ఆలోచనా విధానాల్లో భాగంగా మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు బండి సంజయ్. అంబేద్కర్ సూచనల్లో 370 ఆర్టికల్ రద్దు వుందని, అందుకే మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని చెప్పుకొచ్చారు సంజయ్. రాబోయే రోజుల్లో కామన్ సివిల్ కోడ్ విధానం పట్ల కేంద్రం ఆలోచన చేస్తోందని ఆయన వెల్లడించారు.

అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానిస్తే బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తే భారతీయ జనతా పార్టీ వారి అభ్యున్నతికి పాటు పడుతుందని సంజయ్ తెలిపారు. మే 3వ తేదీ వరకు ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజలందరూ లాక్ డౌన్ పాటించాలని, దేశ వ్యాప్తంగా మోదీ ముందు చూపు వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోన కేసులు పెరగడానికి మర్కజ్ ప్రార్ధనలు కారణమయ్యాయని, రాష్ట్రంలో రేషన్ అందరికి అందడం లేదని దీనికి కేసీఆర్ ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలని సంజయ్ నిలదీశారు.

[svtimeline]అధిక ధరలకు అమ్మితే జైలే గతి… కలెక్టర్లదే బాధ్యత.. జగన్ తాజా హెచ్చరిక[/svtimeline]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu