Revanth Reddy: రేవంత్ భూ భాగోతంలో మరో ఎపిసోడ్.. సవాల్ చేసిన ఎమ్మెల్యే

|

Mar 16, 2020 | 6:19 PM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భూ భాగోతంలో మరో ఎపిసోడ్ చేరింది. మరో భూ దందాకు సంబంధించిన ఆధారాలతో తెరమీదికి వచ్చారు ఓ గులాబీ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలతో ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు.

Revanth Reddy: రేవంత్ భూ భాగోతంలో మరో ఎపిసోడ్.. సవాల్ చేసిన ఎమ్మెల్యే
Follow us on

One more allegation against TPCC working president Revanth Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భూ భాగోతంలో మరో ఎపిసోడ్ చేరింది. మరో భూ దందాకు సంబంధించిన ఆధారాలతో తెరమీదికి వచ్చారు ఓ గులాబీ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలతో ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. భూకబ్జాదారుడైన రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయితే ఎంత కాకపోతే ఎంత అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే.

” రేవంత్ రెడ్డి పెద్ద భూ ఆక్రమణ దారుడు… పెద్ద నీతిమంతునిలా మా నేతపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.. హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో 12 కోట్ల రూపాయలతో భూమి కొని 35 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి ఎగ్గొట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి ది.. ఉప్పల్‌లో కొన్న భూమిని ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి ఎందుకు చూపించలేదు?…” ఇదీ ఇటీవల హుజూర్‌నగర్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైది రెడ్డి సోమవారం చేసిన వ్యాఖ్యలు.

రేవంత్ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆయన సొంత ఆస్తులు, ఆయన అన్నదమ్ముల, బంధువుల ఆస్తులు ఒక్కసారిగా ఎలా పెరిగాయని సైదిరెడ్డి ప్రశ్నించారు. కోకాపేటలో 2006లో మామ పేరు మీద భూములు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయని ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు. రేవంత్ అక్రమాస్తుల ఆధారాలు తమ వద్ద చాలా వున్నాయని, అవి ఎక్కడ బయట పడతాయనే టీఆర్ఎస్ పార్టీపై రేవంత్, ఆయన అనుచరులు ఆరోపణలకు దిగుతూ.. కేసీఆర్‌పై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో పూర్తిగా మునిగిపోయే కాంగ్రెస్ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడైతే ఏంటి కాకపోతే ఏంటి అంటున్న సైదిరెడ్డి.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.