బ్రేకింగ్ : టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరణ.. సీపీఐ నేత చాడ

| Edited By:

Oct 14, 2019 | 8:12 PM

ఉత్కంఠగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది సీపీఐ. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీపీఐ .. ప్రభుత్వ విధానంపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో హూజూర్‌నగర్ ఉపఎన్నికల్లో ఇస్తామన్న మద్దతును ఉపసంహరించుకున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మంది కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిందని, ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని సూచించినా పట్టించుకోలేదని చాడ […]

బ్రేకింగ్ : టీఆర్ఎస్‌కు  మద్దతు ఉపసంహరణ.. సీపీఐ నేత చాడ
Follow us on

ఉత్కంఠగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది సీపీఐ. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీపీఐ .. ప్రభుత్వ విధానంపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో హూజూర్‌నగర్ ఉపఎన్నికల్లో ఇస్తామన్న మద్దతును ఉపసంహరించుకున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మంది కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిందని, ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని సూచించినా పట్టించుకోలేదని చాడ పేర్కొన్నారు. తాము ఈ ఉప ఎన్నికలో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదన్నారు.

తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టిఆర్ఎస్ కు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నామని చాడ తెలిపారు. హుజూర్ నగర్ లో రేపు( మంగళవారం) కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి..ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రేపు చర్చిస్తామన్నారు. మూడు రోజుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామనిర చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం నుండే ఉందని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్‌కు మద్దతిచ్చి అనేక ఇబ్బందుల్లో పడ్డామని.. తాము ఎందుకు మద్దతు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో టిఆర్ఎస్ ఆలోచించుకోవాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.