రోడ్డు మీద ఉమ్మారో ఇక అంతే ! కెసిఆర్ మార్క్ షాక్

రోడ్డు మీద ఉమ్మారో ఇక అంతే ! కెసిఆర్ మార్క్ షాక్

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు యధాశక్తి ప్రయత్నిస్తున్న తెలంగాణా ప్రభుత్వం బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డు మీద ఎవరైనా ఉమ్మితే పక్కా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్మానించారు.

Rajesh Sharma

|

Apr 08, 2020 | 6:14 PM

Open spitting banned in Telangana State: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు యధాశక్తి ప్రయత్నిస్తున్న తెలంగాణా ప్రభుత్వం బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డు మీద ఎవరైనా ఉమ్మితే పక్కా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్మానించారు. కరోనా వ్యాప్తికి అన్ని దారులు మూసెయ్యాలని భావించిన కెసిఆర్ మరిన్ని కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ దిశగా కరోనా వ్యాప్తికి కారణం అయ్యే ఛాన్స్ ఉందన్న ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడాన్ని నిషేదించింది ప్రభుత్వం.

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నిషేధం పరిదిలోకి పాన్, టొబాకో, నాన్ టొబాకో, చూయింగ్ గం లాంటి వాటిని కూడా ఉమ్మితే చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే చర్యలు అంటూ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ఆరోగ్యశాఖ. దీనిని కచ్చితంగా అమలు చేసే బాధ్యతలను మునిసిపల్, పోలీస్ సిబ్బందిపై పెట్టింది. అయితే ఉమ్మివేసే వ్యక్తిని ఎవరు గుర్తిస్తారు ఎలా శిక్షిస్తారు? ఈ అంశాలిపుడు ఆసక్తిరేపుతున్నాయి. దీనికి ప్రభుత్వం చక్కని ఆలోచన చేసింది.

రోడ్డుతోపాటు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేస్తున్న తరుణంలో ఆ సమీపంలో వున్న ఏ ప్రభుత్వ అధికారి అయినా సదరు వ్యక్తిపై చర్య తీసుకునేలా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో పాటు అక్కడ ఏ ప్రభుత్వ అధికారి అక్కడ లేకపోతే.. ఎవరైనా ఉమ్మివేస్తున్న దృశ్యాన్ని మొబైల్‌లో పిక్ తీసి పోలీసులకు పంపిస్తే వారు శిక్షను అమలు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తిలో ఉమ్మి అత్యంత డేంజరస్ పాత్ర పోషిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతాయని తెలుస్తోంది. దీనిలో ప్రజల పాత్ర అత్యంత ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu