దేశంలో కరోనా వైరస్ కేసులు 300 పైగా దాటిన నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గూడ్స్ రైళ్లు యధావిధిగా నడుస్తాయని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.