అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు

| Edited By:

Mar 03, 2019 | 6:59 PM

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు ధ్రువీకరించారు. అయితే వెన్నెముక దిగువన ఆయనకు చిన్నపాటి గాయమైనట్టు స్కానింగ్‌లో తేలిందన్నారు. ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను తరుముకుంటూ వెళ్లిన సమయంలో మిగ్ 21‌కు జరిగిన ప్రమాదంలో…అభినందన్‌కు ఈ గాయమైనట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. వివిధ పరీక్షల నిమిత్తం ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో ఉన్న అభినందన్, మరో 24 గంటలు అక్కడే ఉండే అవకాశం ఉంది. పాక్ ఫైటర్ జెట్‌లను వెంటాడుతూ వెళ్లిన ఆయన.. ఆ […]

అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు
Follow us on

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు ధ్రువీకరించారు. అయితే వెన్నెముక దిగువన ఆయనకు చిన్నపాటి గాయమైనట్టు స్కానింగ్‌లో తేలిందన్నారు. ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను తరుముకుంటూ వెళ్లిన సమయంలో మిగ్ 21‌కు జరిగిన ప్రమాదంలో…అభినందన్‌కు ఈ గాయమైనట్టుగా డాక్టర్లు చెబుతున్నారు.

వివిధ పరీక్షల నిమిత్తం ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో ఉన్న అభినందన్, మరో 24 గంటలు అక్కడే ఉండే అవకాశం ఉంది. పాక్ ఫైటర్ జెట్‌లను వెంటాడుతూ వెళ్లిన ఆయన.. ఆ దేశ భూభాగంలో అడుగు పెట్టగా.. అక్కడి ఆర్మీ ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పాక్ ఆర్మీ గత బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకోగా.. ప్రపంచ దేశాల ఒత్తిడితో పాటు, జెనీవా ఒప్పందానికి తలొగ్గి ఆయనను శుక్రవారం భారత్‌కు అప్పగించింది.