కిలాడీ లేడీ స్వప్ప సురేశ్

|

Jul 10, 2020 | 3:57 PM

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న కేరళ గోల్డ్‌స్కామ్‌ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేశ్‌ను సీఎం కాపాడుతున్నారంటూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

కిలాడీ లేడీ స్వప్ప సురేశ్
Follow us on

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న కేరళ గోల్డ్‌స్కామ్‌ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేశ్‌ను సీఎం కాపాడుతున్నారంటూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం కేసు విచారణను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇందులో కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఉద్యోగుల ప్రమేయముందన్న ఆరోపణలతో సమగ్ర విచారణకు సిద్ధమవుతోంది. దుబాయ్‌ నుంచి యూఏఈ దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్‌ విమానంలో తిరువనంతపురం విమానాశ్రయానికి వచ్చింది. ఈ సరుకును ఈ నెల 5న కస్టమ్స్‌ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీ చేసి 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గృహోపకరణాల మధ్యలో బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఈ కేసులో యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి సరిత్‌ కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

అయితే, ఈ కేసుతో స్వప్న సురేశ్‌ను ప్రధాన నిందితురాలిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్వప్న సురేశ్ కేరళ ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు, కేరళ సర్కారు సీఎం ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ను తప్పించింది. స్వప్న సురేశ్‌ను ఐటీ శాఖలో నియమించడానికి, సీఎంవోలో స్వేచ్ఛనివ్వడానికి కారకుడంటూ ఆయనపై వేటు వేసింది కేరళ సర్కార్. అయితే, సీఎం పినరయి విజయన్‌తో స్వప్న సురేశ్‌కు దగ్గరి సంబంధాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం దీన్ని సీరియ్‌సగా తీసుకుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ అన్నారు. రాజకీయాలకతీతంగా విచారణ పారదర్శకంగా జరిపించాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ కేసు విచారణ బాధ్యతను కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించింది.

విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హోం శాఖ పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకుని, మరింత మెరుగైన దర్యాప్తు జరపాలంటూ కేరళ సీఎం విజయన్‌ ప్రధాని మోదీకి లేఖ రాసిన మరుసటి రోజే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

చదివింది ఏడో తరగతే.. కానీ అరబిక్ అదరగొట్టేస్తుంది. ఉన్నత చదువు లేకపోయినా ఉన్నతమైన కొలువు.. పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు.. వీటన్నింటికీ మించి కేరళలో కీలకమైన పదవిలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అండదండలు పుష్కలంగా ఉండటం.. అంతే, ఆమె రెచ్చిపోయింది. ఏకంగా బంగారాన్ని రాజమార్గంలో అక్రమంగా రవాణా చేయడం ప్రారంభించింది. చాలాకాలంగా సాగుతున్న ఈ తంతు ఇటీవల బయట పడింది. ప్రస్తుతం ఈ కేసు కేరళ రాష్ట్ర సర్కార్ చుట్టూ తిరుగుతోంది. స్వప్నా సురేష్ ది త్రివేండ్రం శివారులోని నెయ్యింట్టకర. ఆమె తల్లి ఇక్కడే ఉంటుండగా.. తండ్రి దుబాయ్ లో ఏదో వ్యాపారం చేసేవారు. దీంతో స్వప్న అప్పుడప్పుడూ దుబాయ్ వెళ్లి వస్తుండేది. తొలుత తిరువనంతపురంలో ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేసిన స్వప్న 2010-11లో దుబాయ్‌ వెళ్లింది. అక్కడి విమానాశ్రయంలో పనిచేస్తుండగా ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో మళ్లీ కేరళకు వచ్చి పడింది. తర్వాత ఎయిర్‌ ఇండియా ఏజెంట్‌గా తిరువనంత పురంలో పనిచేసింది. యూఏఈ కాన్సులేట్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం సంపాదించింది. అక్కడా ఆరోపణలు రావడంతో తొలగించారు. తర్వాత కేరళ ఐటీ మౌలిక సదుపాయాల సంస్థలో లైజనింగ్‌ అధికారిగా బాధ్యతలు పెట్టింది. ఏడో తరగతి మాత్రమే చదివినా.. మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీ ద్వారా నకిలీ డిగ్రీ సంపాదించింది. ఇదే అంశంపై స్పందించిన మహారాష్ట్ర యూనివర్సిటీ స్వప్నది ఫేక్ సర్టిఫికేట్ గా ధృవీకరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న స్వప్న కేరళ హైకోర్టు ఆన్‌లైన్‌లో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు ప్రస్తుతం పరారీలో ఉన్న స్వప్నా సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.