ఇంటెలీజెన్స్ డీజీకు..ఎన్నికల విధులకు సంబంధం లేనందున.. డీజీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా జీవో విడుదల చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు యధావిధిగా తన విధుల్లో కొనసాగనున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఫిర్యాదు మేరకు మంగళవారం ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఈసీ జీవో విడుదలైన సంగతి తెలిసిందే. పాత జీవోను పూర్తిగా రద్దు చేసి కడప, శ్రీకాకుళం ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల పేర్లను మాత్రమే తాజా జీవోలో చేర్చారు. కాగా ఇప్పటికే ఇదే విషయంపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే.