పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని నిజామాబాద్ ఎంపీ కవిత ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా తిర్మన్ పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ… ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. దేశంలో అధికారంలో ఎవరుండాలని జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి, కాంగ్రెస్ కు సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని కవిత తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు సైతం తమ గ్రామాలను తెలంగాణలో కలుపు మంటున్నారన్నారు. బీజేపీ వాళ్ళు మాటలు చెప్పి ఓట్లు తెచ్చుకుంటున్నారు.. మనకోసం మాట్లాడే ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలన్నారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కు 90 శాతం నిధులు ఇచ్చారు.. కాళేశ్వరానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని కవిత మండిపడ్డారు. కాళేశ్వరం పూర్తయితే ఆకాశం వైపు చూసే అవకాశం ఉండదన్నారు