రాబోయే గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలిసి ఆయన ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. భక్తులంతా ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మేయర్ రామ్మోహన్ తెలిపారు. నగరంలో నిమజ్జనం కోసం మొత్తం 32 కొలనులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, పది రోజులపాటు భక్తులు గణేశుణ్ని దర్శించుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. భద్రతకు సంబంధించి 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని మేయర్ తెలిపారు. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసే మండపాల వివరాలను పోలీసులకు తెలియజేసి పర్మిషన్ తీసుకోవాలన్నారు.