రెండంకెల వ‌ృద్ధి ఎక్కడ బాబు..!- మంత్రి బుగ్గన విమర్శలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 15, 2020 | 10:54 AM

గత ప్రభుత్వం అంచనాలను ఎప్పుడు అందుకోలేదు అని ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఆరోపించారు. రెండంకెల ఆర్ధిక వృద్ధి ఎప్పుడు జరిగిందని ఆయన నిలదీశారు. 2019 నుంచి ఆర్ధిక మాంద్యం ఉందని ఆయన పేర్కొన్నారు. 2018-2019 ఆర్ధిక ప్రగతి ఎక్కడ సాధించారు అని టీడీపీని నిలదీశారు. యనమల ఆర్థిక అంశాలపై వారానికి ఒకసారి ప్రస్థావన తెస్తున్నారని.. యనమల చెప్పే గణాంకాలు ఒక్కటి కూడా నిజాలు లేవని అన్నారు. రాష్ట్రంలో వృద్ది రేటు […]

రెండంకెల వ‌ృద్ధి ఎక్కడ బాబు..!- మంత్రి బుగ్గన విమర్శలు
Buggana
Follow us on

గత ప్రభుత్వం అంచనాలను ఎప్పుడు అందుకోలేదు అని ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఆరోపించారు. రెండంకెల ఆర్ధిక వృద్ధి ఎప్పుడు జరిగిందని ఆయన నిలదీశారు. 2019 నుంచి ఆర్ధిక మాంద్యం ఉందని ఆయన పేర్కొన్నారు. 2018-2019 ఆర్ధిక ప్రగతి ఎక్కడ సాధించారు అని టీడీపీని నిలదీశారు.

యనమల ఆర్థిక అంశాలపై వారానికి ఒకసారి ప్రస్థావన తెస్తున్నారని.. యనమల చెప్పే గణాంకాలు ఒక్కటి కూడా నిజాలు లేవని అన్నారు. రాష్ట్రంలో వృద్ది రేటు పడిపోయింది అని యనమల విమర్శించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ లో అంత స్లోడౌన్ లేదని అన్నారు.

కేవలం 2.5 శాతం తగ్గితే 40 శాతం అని చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా రాబడులు తగ్గాయన్నారు. 2018-19 లో బడ్జెట్ వ్యయం 1.66 లక్షల కోట్ల టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే….. తర్వాత ఏడాది మేము 1.77 లక్షల కోట్లు కర్చు చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన 15000 కోట్లు బకాయిలు మేము చెల్లించామన్నారు.