రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు(83) మృతిచెందారు. విశాఖ బీచ్‌రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఓ వాహనం ఆయన్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సత్యారావును స్థానికులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. రెండు సార్లు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1999లో చోడవరం నియోజకవర్గం నుంచి సత్యారావు విజయం సాధించారు. మంత్రిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, సమితి ప్రెసిడెంట్ గా, డిసిసిబి చైర్మన్ గా సత్యారావుసేవలందించారు.