గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి

|

Apr 29, 2020 | 7:05 PM

పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు దీక్షకు దిగారు. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా గవర్నర్ కిరణ్ బేడి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మల్లాడి దీక్ష ప్రారంభించారు. గవర్నర్ కిరణ్ బేడీపై ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి, అసెంబ్లీ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు.

గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి
Follow us on

పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు దీక్షకు దిగారు. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా గవర్నర్ కిరణ్ బేడి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మల్లాడి దీక్ష ప్రారంభించారు. గవర్నర్ కిరణ్ బేడీపై ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి, అసెంబ్లీ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం ప్రజలను క్వారెంటైన్‌కు పంపకుండా.. కనీసం ఆసుపత్రిలో పరీక్షలు కూడా చేయించకుండా మూడు రోజుల పాటు చెక్‌పోస్టు దగ్గర నిలిపి వేయడంపై మల్లాడి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం ప్రజల మీద దృష్టి సారించాలని మంగళవారం ఉదయం అల్టిమేటం ఇచ్చిన మంత్రి మల్లాడి.. తన అల్టిమేటంను ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం ఉదయం దీక్ష ప్రారంభించారు.

స్వయంగా తానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నా తన ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి కావడంపై మల్లాడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ఎదుట మల్లాడి కృష్ణారావు దీక్ష చేపట్టారు. గవర్నర్ కిరణ్ బేడీ మొదటినుంచి ఏకపక్ష నిర్ణయాలతో పుదుచ్చేరి ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగ చేస్తున్నారని మల్లాడి ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జోక్యంతో సహచర మంత్రులు వచ్చి కృష్ణారావుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు.

Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

Read this:  రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు 

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

Read this:  లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

Read this:  ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!