మెగాస్టార్ చిరంజీవి ఆగష్టు 22న 65వ వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ఇక కొందరైతే చిరు కోసం స్పెషల్ బర్త్ డే గిఫ్ట్‌లు అందించారు. ఇందులో భాగంగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల కూడా తన శ్రీమతితో కలిసి.. చిరంజీవి కెరీర్లో ఒకానొక హిట్ చిత్రం ‘ఛాలెంజ్’. ఈ సినిమాలోని ”ఇందువదన.. కుందరదన.. ఐలవ్ యూ” ఓ హారిక సాంగ్‌ని రీక్రియేట్ చేసి మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్‌గా అందించాడు. ఆదిత్య మ్యూజిక్ తమ అఫీషియల్‌గా యూట్యూబ్‌లో ఈ పాటను అప్లోడ్ చేసింది.
కాగా ఈ పాట చూసి ఫిదా అయిన మెగాస్టార్.. సుధాకర్ జంటకు అభినందనలు తెలిపుతూ ఆడియో సందేశాన్ని పంపారు. మీ డ్యాన్స్ చూస్తుంటే నాకు మళ్లీ ఆ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. నీ శ్రీమతి హరిక టెకీ గార్ల్ అయి ఉండి కూడా ఎంతో గ్రేస్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో స్టెప్పులేసింది. నీ కంటే ఆమె డ్యాన్స్‌కే నేను ఎక్కువ మార్కులు వేస్తున్నా. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి.. మీకు ఈ ఆడియో పంపుతున్నా. మీ ఇద్దరూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లా హాయిగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ వారిని ప్రశంసించారు చిరు.
#Megastar @KChiruTweets responds on Actor #SudhakarKomakula @UrsSudhakarK‘s attempt to give a Birthday special dance tribute along with his wife #HarikaSandepogu.
Impressed with their intention & dance, Chiru thanks them with a Virtual Voice message. #MegastarChiranjeevi pic.twitter.com/k6vkwafHqG
— BARaju (@baraju_SuperHit) August 28, 2020