‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్‍కు నాగబాబు సపోర్ట్

మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ప్యానెల్‌కు మద్దతునిచ్చారు. ఇప్పటి వరకూ సైలెంట్ ఉన్న ఆయన.. నరేష్, రాజశేఖర్ ప్యానెల్‌కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం రాత్రి నరేష్ ప్యానెల్ సభ్యులు, నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. మా అధ్యక్ష పదవిని ఒకరు ఒకసారి మాత్రమే చేపట్టాలని, రెండోసారి చేపట్టడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. Mega brother #Nagababu extends his support for @ItsActorNaresh and @ActorRajasekhar panel for […]

మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్‍కు నాగబాబు సపోర్ట్

Edited By:

Updated on: Mar 09, 2019 | 11:40 AM

మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ప్యానెల్‌కు మద్దతునిచ్చారు. ఇప్పటి వరకూ సైలెంట్ ఉన్న ఆయన.. నరేష్, రాజశేఖర్ ప్యానెల్‌కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం రాత్రి నరేష్ ప్యానెల్ సభ్యులు, నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. మా అధ్యక్ష పదవిని ఒకరు ఒకసారి మాత్రమే చేపట్టాలని, రెండోసారి చేపట్టడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు.

ఈ కారణంతోనే తాను రెండోసారి మా అధ్యక్షుడిగా చేయడానికి నిరాకరించానని చెప్పిన నాగబాబు.. అందరికీ అవకాశం ఇవ్వాలన్నారు. ఈసారి నరేష్, రాజశేఖర్‌కు మద్దతు ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఈ ప్యానల్‌లో జీవితకి మంచి పదవి ఇస్తుండటం ఆహ్వానించదగ్గ విషయమని మెగా బ్రదర్ చెప్పారు. మా జనరల్ సెక్రటరీగా నరేష్ బాగా పని చేశారన్న నాగబాబు.. అందుకే ఆయనకు మద్దతిస్తున్నానని తెలిపారు.