విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. అమరావతిలో విశ్వరూప మహాసభకు అనుమతి నిరాకరణ అన్యాయమన్నారు. మాదిగలకు నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులో టీడీపీ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకుండా… మాలలకే పెద్ద పీట వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబును.. రానున్న ఎన్నికల్లో గద్దె దించి తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. కాగా ఈనెల 29న తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు మందకృష్ణ మాదిగ.