‘ఛలో ఘర్ కీ బార్’…బాంద్రా సూత్రధారి అరెస్ట్..
ముంబైలోని బాంద్రాలో దాదాపు వెయ్యిమందిని రెచ్ఛగొట్టి.. నిన్న సాయంత్రం భారీ ఆందోళనకు తెర తీసిన సూత్రధారి వినయ్ దూబే ని పోలీసులు అరెస్టు చేశారు. తనను లేబర్ లీడర్ గా చెప్పుకుంటున్న ఈ వ్యక్తి.. 'ఉత్తర్ భారతీయ్ మహా పంచాయత్ '......

ముంబైలోని బాంద్రాలో దాదాపు వెయ్యిమందిని రెచ్ఛగొట్టి.. నిన్న సాయంత్రం భారీ ఆందోళనకు తెర తీసిన సూత్రధారి వినయ్ దూబే ని పోలీసులు అరెస్టు చేశారు. తనను లేబర్ లీడర్ గా చెప్పుకుంటున్న ఈ వ్యక్తి.. ‘ఉత్తర్ భారతీయ్ మహా పంచాయత్ ‘ అనే ఎన్జీఓ ను నిర్వహిస్తున్నాడు. లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగానే వినయ్ దూబే సోషల్ మీడియా ద్వారా రెచ్ఛగొట్టే సందేశాలు ఇఛ్చినట్టు వెల్లడైంది. లాక్ డౌన్ ని ఏప్రిల్ 14 తరువాత కూడా పొడిగించినందున ఇక కార్మికులు, వేతన జీవులంతా తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు సిధ్ధంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం యూపీ, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలకు రైళ్లను ఏర్పాటు చేసిందని ఇతగాడు పేర్కొన్నాడట.’ఛలో ఘర్ కీ బార్’..(ఇళ్లకు వెళ్లేందుకు రెడీగా ఉండండి).. మీరంతా దీన స్థితిలో ఉన్నారు.. కరోనాతో కాకపోయినా ఇక్కడే ఆకలితో మరణిస్తారు.. ఈ నెల 14 లేదా 15 వరకు వెయిట్ చేస్తాం.. ప్రభుత్వం ఏమీ చెయ్యకపోతే నేనే మీ అందరితో కాలినడకన జర్నీ సాగిస్తాను’ అని వినయ్ దూబే తెలిపాడట. బాంద్రా స్టేషన్ వద్ద ఆందోళనకు దిగినవారిలో ఈ నాలుగు రాష్ట్రాల వర్కర్స్ ఉన్నారు. వినయ్ దూబే ‘పిలుపు’తో వీరంతా సుమారు వెయ్యి మంది వరకు ఆ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులతో దాదాపు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అతి కష్టం మీద పోలీసులు అదుపులోకి తెచ్చారు. చివరకు నిన్న రాత్రి నవీ ముంబైలో వినయ్ దూబేను ఖాకీలు అరెస్టు చేశారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ పెద్ద సంఖ్యలో వీరంతా అక్కడికి చేరుకోవడం పెను సంచలనానికి దారి తీసింది.