AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే

దేశంలో లాక్ డౌన్ పొడిగింపుతో చాలా మంది చతికిలా పడ్డారు. గత 22 రోజులుగా ఇళ్ళకే పరిమితమై కనీసం ఏప్రిల్ 15 నుంచైనా సాధారణ జీవితం గడుదామనుకున్న సామాన్యుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో ఉస్సూరుమంటూ నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే.. 21 రోజుల తర్వాత లాక్ డౌన్ ఒకేసారి ఎత్తేస్తే పరిస్థితి ఏంటి ?

ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే
Rajesh Sharma
|

Updated on: Apr 15, 2020 | 8:12 PM

Share

దేశంలో లాక్ డౌన్ పొడిగింపుతో చాలా మంది చతికిలా పడ్డారు. గత 22 రోజులుగా ఇళ్ళకే పరిమితమై కనీసం ఏప్రిల్ 15 నుంచైనా సాధారణ జీవితం గడుదామనుకున్న సామాన్యుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో ఉస్సూరుమంటూ నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే.. 21 రోజుల తర్వాత లాక్ డౌన్ ఒకేసారి ఎత్తేస్తే పరిస్థితి ఏంటి ? అసలే ఓ వైపు కొన్ని చోట్ల కరోనా పాజిటివ్ కేసులో పెద్ద ఎత్తున నమోదవుతూనే వున్నాయి. కరోనా ప్రభావం లేని ప్రాంతాలకు కూడా విస్తరిస్తే పరిస్థితి ఏంటి ? ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రధానమంత్రి.

అయితే, లాక్ డౌన్ నుంచి ఎగ్జిట్ ఎలా? దీనికి తొలి అడుగు పడేది ఏప్రిల్ 20వ తేదీ నుంచే అని ప్రధాని చెప్పకనే చెప్పారు. అన్నట్లుగానే బుధవారం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లభించనున్న సడలింపులను కేంద్రం చూచాయగా లీక్ చేసింది. ఈ లీకేజీల ప్రకారం కొన్ని సెలెక్టెడ్ యాక్టివిటీస్ ఏప్రిల్ 20వ తేదీనుంచి అనుమతించనున్నారు.

దేశంలో అన్ని రకాల గూడ్సు రవాణా వ్యవస్థలను ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం అనుమతించనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ సంబంధ పనులు, వ్యవసాయోత్పత్తులన మార్కెటింగ్ కార్యకలాపాలను అనుమతించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం సిబ్బందితో వర్క్ అనుమతిస్తారు. అయితే సామాజిక దూరాన్ని విధిగా పాటించాల్సి వుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు చేసుకోవచ్చు. కానీ వారికి శుభ్రమైన వాతావరణం కల్పించాలి. సామాజిక దూరాన్ని పాటించాల్సి వుంటుంది. సాగునీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణ పనులను కూడా ఏప్రిల్ 20వ తేదీ నుంచి అనుమతించబోతున్నారు.

అదే సమయంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 3వ తేదీ దాకా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, హాస్పటాలిటీ సర్వీసెస్, ఎయిర్, రోడ్డు, రైల్ పాసెంజర్ సర్వీసులు, అన్నిరకాల సోషల్ గ్యాదరింగ్స్, అన్నిరకాల విద్యాసంస్థలు, అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, ప్రధాన నగరాల్లో మెట్రో రైల్ సర్వీసులపై లాక్ డౌన్ కొనసాగుతుంది.

Read this: ఏపీలో ఏకంగా 32 వేల మందికి కరోనా పరీక్షలు.. జగన్ సంచలన ఆదేశం

Read this: బాబోయ్.. 477 జిల్లాలకు కరోనా ప్రమాదం.. కేంద్రం వార్నింగ్

Read this: ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే