AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: లారీల మధ్య ఇరుక్కున్నా.. బతికిపోయిన లక్కీ ఫెల్లో

లక్కుంటే లైఫ్‌కు ఢోకా లేదన్న మాట బుధవారం తెల్లవారుజామున సంగారెడ్డి పట్టణ శివారులో అక్షరాలా నిజమైంది. రెండు లారీలు తన వెనుకే ఢీకొన్నా ఓ వ్యక్తి బతికి పోయాడు. రెండు లారీలు డీకొని తనవైపే దూసుకురాగా.. వాటి మధ్య చిక్కుకున్న వ్యక్తి చిన్న గాయం కూడా లేకుండా బతికి బట్ట కట్టాడు. వైరల్ మారిన వీడియో ఇపుడు హల్‌చల్ చేస్తోంది.

Breaking News: లారీల మధ్య ఇరుక్కున్నా.. బతికిపోయిన లక్కీ ఫెల్లో
Rajesh Sharma
|

Updated on: Feb 26, 2020 | 1:05 PM

Share

Man luckily escapes when two lorries hit each other: భూమ్మీద నూకలుంటే ఎలాంటి విపత్కర పరిస్థితి నుంచైన బతికిపోతాం అనడానికి చక్కని ఉదాహరణ బుధవారం తెల్లవారు జామున సంగారెడ్డి శివారులో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అత్యంత సమీపంలోనే రెండు లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. తన వెనుక తరుముకొస్తున్న రెండు లారీల గురించి తెలియని సదరు వ్యక్తి కూల్‌గా రోడ్డు దాటుతుండగా.. రెండు లారీలు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్

సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో లారీల బీభత్సం సృష్టించాయి. ఒకే వైపు వెళ్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. రెండు లారీలు తరుముకొస్తున్న విషయం గమనించని సదరు వ్యక్తి రోడ్డు డివైడర్ దాటేందుకు వెళుతుండగా… రెండు లారీలు ఒకదానికి మరొకటి ఢీకొని ఆ వ్యక్తి వెళుతున్న వైపే దూసుకొచ్చాయి. అయితే.. ఆ వ్యక్తి రెండు లారీల మధ్య నుంచి ఆ వ్యక్తి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు.

ఇదీ చదవండి: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త మీమాంస

బుధవారం తెల్లవారుజామున పోతిరెడ్డి పల్లి చౌరస్తాలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపునకు ఓ లారీ వస్తోంది. ఆ వ్యక్తి వెనుక నుంచి మరో లారీ వచ్చింది. రెండు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. చివరి నిమిషయంలో గమనించిన వ్యక్తి రెండు లారీల మధ్య నుంచి ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయట పడ్డాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. సంఘటన ఆ ప్రాంతంలో ఒక్కసారి భయాందోళన కలిగించింది. ఈ యాక్సిడెంట్ వీడియో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: ఐటీ అధికారులకు నయీం ఫ్యామిలీ షాక్

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్