వైసీపీలో ఇతర నాయకులతో సమానంగా.. ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చిన.. లక్ష్మీపార్వతికి జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంత కాలానికి.. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీ పార్వతిని నియమిస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెన్నంటి ఉండి నడిచిన ఆమె.. ఆ మధ్య.. అమరావతిలో రాజకీయంగా జరిగిన పలు ప్రధాన సంఘటనలపై స్పందించకుండా మౌనం వహిస్తూ వచ్చారు. అయితే.. ఏపీలో జగన్ ప్రభుత్వం.. ఏర్పాటైన తరువాత.. ఫైర్ బ్రాండ్స్.. లక్ష్మీ పార్వతికి మంచి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. ఇప్పటిదాకా.. ఆమెకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఈ కారణం చేతనే ఆమె.. రాజకీయాలకు దూరంగా ఉన్నారని.. పలు వార్తలు కూడా వినిపించాయి.
అమరావతి రాజధానిపై దుమారం రేగినప్పుడు గానీ, జగన్ వందరోజుల పాలనపై గానీ, కోడెల మృతిపై గానీ.. ఆమె స్పందించిన దాఖలాలు కనబడలేదు. అసలు జగన్.. మంత్రివర్గ ఏర్పాటు నుంచే లక్ష్మీ పార్వతి ఊసు కనబడకుండా పోయింది. జగన్.. సీఎం కాకముందు పాదయాత్రలో అప్పుడప్పుడు పాల్గొన్న ఆమె.. రోజాతో ధీటుగా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మని నియమించినప్పుడు కూడా.. ఆమె స్పందన లేకుండా పోయింది. కాగా.. ఇప్పటికైనా లక్ష్మీ పార్వతి స్పందిస్తారో లేదో చూడాలి. నాకు పదవులు ముఖ్యం కాదు.. నిజాయితీ వైపే ఉంటానని ఆవిడ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఈ పదవిని ఆవిడ స్వీకరిస్తారో లేదో.. చూడాలి.