ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

|

Apr 29, 2020 | 7:07 PM

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న హైదరాబాద్ ఐఐటీలో కలకలం రేగింది. ఉద్యోగులతో తలెత్తిన వివాదంలో రెచ్చిపోయిన కార్మికులు ఎల్ అండ్ టీ ఉద్యోగులపై తిరగబడ్డారు. విచక్షణా రహితంగా వారిపై దాడికి తెగించారు.

ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్
Follow us on

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న హైదరాబాద్ ఐఐటీలో కలకలం రేగింది. ఉద్యోగులతో తలెత్తిన వివాదంలో రెచ్చిపోయిన కార్మికులు ఎల్ అండ్ టీ ఉద్యోగులపై తిరగబడ్డారు. విచక్షణా రహితంగా వారిపై దాడికి తెగించారు. దాంతో పలువురు ఎల్ అండ్ టీ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి.

బుధవారం ఉదయం హైదరాబాద్ ఐఐటి భవన నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులకు, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి ఉద్యోగులకు మధ్య వివాదం తలెత్తింది. దాంతో రెచ్చిపోయిన కార్మికులు ఉద్యోగులపై రాళ్లు, ఇటుకలతో దాడికి తెగబడ్డారు. చేతికి అందిన వారిని చితక్కొట్టారు. దొరికిన వారిని దొరికినట్టుగా తరిమి కొట్టారు.

విషయం తెలుసుకుని ఐఐటీకి చేరుకున్న పోలీసులను సైతం కార్మికులు వదిలిపెట్టలేదు. పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దాంతో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ. సంగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ పోలీస్ జీపును కార్మికులు ధ్వంసం చేశారు.

కార్మికుల్లో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనులు చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఉద్యోగులు.. కార్మికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారిలో ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. కార్మికుల్లో ఆగ్రహావేశాలు చల్లారక పోవడంతో ఐఐటి హైదరాబాద్ గేటు ముందు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

Read this:  రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు 

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

Read this:  లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!

Read this:  గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి