‘క్రమ శిక్షణ, సహనం.. ఇవే మాకు శ్రీరామరక్ష’.. బిపిన్ రావత్

| Edited By: Anil kumar poka

Apr 26, 2020 | 3:44 PM

సైన్యంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మా క్రమ శిక్షణ, సహనం ఎంతో తోడ్పడ్డాయని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ఈ హెల్త్ క్రైసిస్  మాకు కీలక పాఠాలు నేర్పిందన్నారు. కరోనా వైరస్ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ ని, నేవీని కూడా పరిమితంగా తాకిందని చెప్పిన ఆయన..

క్రమ శిక్షణ, సహనం.. ఇవే మాకు శ్రీరామరక్ష.. బిపిన్ రావత్
Follow us on

సైన్యంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మా క్రమ శిక్షణ, సహనం ఎంతో తోడ్పడ్డాయని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ఈ హెల్త్ క్రైసిస్  మాకు కీలక పాఠాలు నేర్పిందన్నారు. కరోనా వైరస్ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ ని, నేవీని కూడా పరిమితంగా తాకిందని చెప్పిన ఆయన.. ఈ సంక్షోభ సమయంలో మేం కొన్ని ముఖ్యమైన ‘పాఠాలను’ నేర్చుకున్నామన్నారు. కేవలం నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో వెంటిలేటర్ల ఉత్పత్తిని ప్రారంభించామని, విదేశాల నుంచి ఆయుధ సంపత్తిని దిగుమతి చేసుకునే మేం.. ఇలా కరోనా రోగులకు అవసరమైన వెంటిలేటర్లను సైతం తయారు చేయడం విశేషమని అన్నారు. ఈ తరుణం మాకు ఇదే నేర్పింది అని వ్యాఖ్యానించారు. ఇతరులపై ఆధారపడకుండా  స్వావలంబనకు ఇది సమయమని, కరోనాపై దేశం పోరాటం జరుపుతున్నప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు రక్షణ దళాలు కూడా సహకరించవలసి ఉందని బిపిన్ రావత్ పేర్కొన్నారు. మా రక్షణ దళాలన్నీ ఈ వైరస్ ని సవాలుగా తీసుకున్నాయని. వారి సహనం, క్రమశిక్షణ, సామాజిక దూరం పాటింపు వంటివి దీన్ని పరిమితం చేశాయని ఆయన అన్నారు. ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేని ఓ నేవీ అధికారి ద్వారా నౌకా దళంలో 26 మంది అధికారులకు వైరస్ సోకిందని, అయితే తక్షణమే దీని నివారణకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.