కేరళలో కొత్తగా 40 మందికి కరోనా.. ఇతర ప్రాంతాల వారే ఎక్కువ – సీఎం విజయన్

|

May 27, 2020 | 6:22 PM

కేరళకు కొత్త టెన్షన్ మొదలయింది. మొన్నటి వరకు ఒకటి రెండు మాత్రమే నమోదయ్యే కొత్త కేసులు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కేరళలో 40 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. వీరిలో 9 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు కాగా..16 మంది మహారాష్ట్ర, ఐదుగురు తమిళనాడు, ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చారని తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 1004కు చేరుకోగా.. వీటిలో 445 యాక్టివ్‌ […]

కేరళలో కొత్తగా 40 మందికి కరోనా.. ఇతర ప్రాంతాల వారే ఎక్కువ - సీఎం విజయన్
Follow us on

కేరళకు కొత్త టెన్షన్ మొదలయింది. మొన్నటి వరకు ఒకటి రెండు మాత్రమే నమోదయ్యే కొత్త కేసులు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కేరళలో 40 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. వీరిలో 9 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు కాగా..16 మంది మహారాష్ట్ర, ఐదుగురు తమిళనాడు, ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చారని తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 1004కు చేరుకోగా.. వీటిలో 445 యాక్టివ్‌ కేసులున్నాయని సీఎం విజయన్‌ వెల్లడించారు. మంగళవారం నాటికి వివిధ దేశాల్లో ఉన్న 173 మంది కేరళవాసులు కరోనాతో చనిపోయారని పేర్కొన్నారు. తొలి కరోనా కేసు రాష్ట్రంలో నమోదు అయిన కేరళలో కాస్త తగ్గుదల కనిపించింది. కానీ, లాక్ డౌన్ సడలింపుల కారణంగా దేశ, విదేశాల నుంచి జనం రాకపోకలు సాగుతుండడంతో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.