#COVID19 ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సీరియస్ వార్నింగ్

కరోనా ప్రభావం పెరగడమే కానీ తగ్గే సంకేతాలు కనిపించకపోవడంతో కేంద్ర, రాష్ట్రాలు సీరియస్ స్టెప్స్ తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పెంచుతూ వెళుతున్నాయి. అయితే ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా.. ప్రజల్లో సీరియస్ నెస్ కనిపించడం లేదని..

#COVID19 ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సీరియస్ వార్నింగ్

Updated on: Mar 23, 2020 | 6:05 PM

Aravind Kejriwal serious warning to Delhi people: కరోనా ప్రభావం పెరగడమే కానీ తగ్గే సంకేతాలు కనిపించకపోవడంతో కేంద్ర, రాష్ట్రాలు సీరియస్ స్టెప్స్ తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పెంచుతూ వెళుతున్నాయి. అయితే ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా.. ప్రజల్లో సీరియస్ నెస్ కనిపించడం లేదని సోమవారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరూపణ అయ్యింది. దాంతో మరిన్ని కఠిన చర్యలకు, మరింత సీరియస్ వార్నింగ్ లకు రెడీ అవుతున్నారు పాలకులు.

తాజాగా ఢిల్లీ నగరం చాలా తీవ్రమైన విపత్తులో ఉన్న దరిమిలా అక్కడి ముఖ్యమంత్రి రాజధాని వాసులకు సీరియస్ వర్కింగ్ ఇచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూతో ప్రదర్శించిన స్ఫూర్తి.. సోమవారం నాటికి వదిలేయడం… అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం పొద్దున్నే ప్రజల్లో ఆత్రుత, లాక్ డౌన్ ఉన్నప్పటికీ పొద్దున్నే పెద్ద సంఖ్యలో బయటకు వచ్చిన జనంలో కరోనా వైరస్ వస్తుందన్న భయం కనిపించకపోవడం.. అందరిని కలవరపరిచింది.

ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతో పాటు దేశ ప్రజలను కూడా పరిస్థితిలో తీవ్రతను దృష్టిలో పెట్టుకుని స్పందించాలని కోరారు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజధాని వాసులను సీరియస్ గా హెచ్చరించారు. సోమవారం కేవలం విజ్ఞప్తులకు పరిమితం అయ్యామని.. మంగళ వారం నుంచి ఇక కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు కేజ్రీవాల్.

కరోనా వైరస్ బారిన పడొద్దన్న ఉద్దేశంతోనే కఠిన నిబంధనలు తెస్తే ప్రజలే పాటించకపోతే ఎలా అంటూ అయన ఆవేదన వ్యక్తం చేశారు. సో.. మంగళవారం నుంచి లాక్ డౌన్ మరింత కఠినంగా ఉండబోతుందన్న సంకేతాలను కేజ్రీవాల్ ఇచ్చారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిసితి కనిపిస్తోంది.