కెసీఆర్ మరో యాగం.. ప్రయత విశేషాలు అనంతం

| Edited By:

Oct 24, 2019 | 1:39 PM

చండీయాగం, ఆయుత చండీయాగం, రాజ శ్యామల యాగం. ఇలా దేశంలో ఎవరు చేయనంత గొప్పగా కెసిఆర్ యాగాలు చేస్తుంటారు. హాట్ హాట్ పొలిటికల్ డిసిషన్ లకే కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ కెసిఆర్ తన ప్రత్యేకతను చూపిస్తారు. తాజాగా గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమవుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇల్లు పూర్తవగానే ప్రయత చండీయాగం నిర్వహించనున్నట్లు సమాచారం. గతంలో నిర్వహించిన అయుత చండీ యాగానికి రెట్టింపు ఏర్పాట్లు ఈ యాగానికి అవసరం. తెలంగాణ సీఎం […]

కెసీఆర్ మరో యాగం.. ప్రయత విశేషాలు అనంతం
Follow us on

చండీయాగం, ఆయుత చండీయాగం, రాజ శ్యామల యాగం. ఇలా దేశంలో ఎవరు చేయనంత గొప్పగా కెసిఆర్ యాగాలు చేస్తుంటారు. హాట్ హాట్ పొలిటికల్ డిసిషన్ లకే కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ కెసిఆర్ తన ప్రత్యేకతను చూపిస్తారు. తాజాగా గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమవుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇల్లు పూర్తవగానే ప్రయత చండీయాగం నిర్వహించనున్నట్లు సమాచారం. గతంలో నిర్వహించిన అయుత చండీ యాగానికి రెట్టింపు ఏర్పాట్లు ఈ యాగానికి అవసరం.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి మొదటి నుంచి దైవభక్తి చాలా ఎక్కువ. ఉద్యమ కాలం లోనూ అనేక యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీయాగం తో దేశవ్యాప్తంగా కేసీఆర్ యాగాల పై చర్చ మొదలైంది. అంత గొప్పగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు కేసీఆర్. ఇక దైవదర్శనాలు ప్రత్యేకం. ఇప్పటివరకూ పలు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలను దర్శించుకున్నారు.

యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని నెలల్లోనే యాదాద్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా మహా సుదర్శన యాగాన్ని జరుపుతానని గతంలోనే సీఎం ప్రకటించారు. దాదాపు పది లక్షల మందితో భారీ ఏర్పాట్లతో ఈ యాగం జరగనుంది. అయితే అంతకంటే ముందే కేసీఆర్ వ్యక్తిగతంగా మరో యాగం చేయనున్నారు.

గతంలో ఆయుత చండీయాగం పూర్తయిన సందర్భంగా ప్రయత చండీయాగం నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ భారీ యాగాన్ని నిర్వహించనున్నారు. తన ఫామ్‌హౌస్‌లో కొత్తగా నిర్మించిన ఇంటి నిర్మాణం పూర్తి కాగానే ఈ యాగం చేయనున్నట్లు సమాచారం.

వెయ్యికి పైగా కుండలతో… వేల మంది రుత్వికులు, పురోహితులతో… లక్షల సార్లు చండీమాత పారాయణం చేస్తారు. అత్యంత కఠిన నియమ నిబంధనలతో, పరిశుద్ధమైన వాతావరణంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రయుత చండీ యాగాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేయాలి. దేశంలో ప్రయుత చండీయాగం లు చాలా అరుదుగా జరిగాయి. ఇక ఈ జనరేషన్ లో దాదాపుగా ఇదే మొదటిది అని చెప్పవచ్చు. ఈ యాగాన్ని కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.