తెలంగాణలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది కెసీఆర్ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా బుసాని వెంకటేశ్వర్ రావును నియమించారు. ఎం.సి.హెచ్.ఆర్.డి. అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఏ.అశోక్‌ని, కరీంనగర్ కలెక్టర్‌గా కే. శశాంక్‌ని నియమించారు. ఆయన ఇదివరకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
కరీంనగర్ కలెక్టర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు కీలకబాధ్యతలప్పగించిన కేసీఆర్ ప్రభుత్వం ఆయన్ని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. శ్వేత మహంతికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు.