సోషల్ మీడియాలో సెలబ్రిటీలను విమర్శించే వారిపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సెలబ్రిటీలకు ఫీలింగ్స్ లేవని అందరూ అనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనను ఆంటీ అని సంబోధించడం, వయసుకు తగ్గ దుస్తులు వేసుకోమని తనకు వస్తున్న సలహాలపై కరీనా స్పందించారు.
సెలబ్రిటీల ఫీలింగ్స్ గురించి ప్రజలకు ఏ మాత్రం అవగాహనలేదు, తెలియదు. మాకు భావాలు ఉంటాయి అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన కరీనాకపూర్ ‘గుడ్‌న్యూస్’ అనే చిత్రంలో కరీనా కపూర్ నటిస్తోంది. కియారా అద్వాణీ కీలక పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.