రేపు తెలంగాణలో చిరుజల్లులు
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరసర ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనితో పాటు వాయవ్య బంగాళాఖాతం నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు దక్షిణకోస్తా, ఒడిసా, కోస్తాంధ్ర, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 900 మీటర్ల ఎత్తు వద్ద ఉపరితలద్రోణి బలహీనంగా మారినట్లు వివరించారు. దీని ప్రభావం వల్ల ఆదివారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించారు.