అమ్మ కట్టిన చీర.. నాకు చాలా ఇష్టం-శ్రీదేవి కూతురు

Janhvi Kapoor says mom Sridevi’s saree is her Favourite : అమ్మంటే మెరిసే దీపం.. అమ్మ ఉన్నంత కాలం తన విలువ తెలియదు. తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం యొక్క ప్రభావం మనిషిని మనసుని ఏవిధంగా ఎంతలా దుఃఖించేలా చేస్తుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. నలుగురిలో ఎలా బ్రతకాలో నేర్పిన అమ్మ పాఠాల మాటలు పిలుపే అందని దూరాలలో…భగవంతుడు లేని చీకటి దేవాలయమే కదా ఎంత బలం బలగం ఉన్నా ఏమి? […]

అమ్మ కట్టిన చీర.. నాకు చాలా ఇష్టం-శ్రీదేవి కూతురు

Updated on: Aug 08, 2020 | 6:01 AM

Janhvi Kapoor says mom Sridevi’s saree is her Favourite : అమ్మంటే మెరిసే దీపం.. అమ్మ ఉన్నంత కాలం తన విలువ తెలియదు. తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం యొక్క ప్రభావం మనిషిని మనసుని ఏవిధంగా ఎంతలా దుఃఖించేలా చేస్తుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. నలుగురిలో ఎలా బ్రతకాలో నేర్పిన అమ్మ పాఠాల మాటలు పిలుపే అందని దూరాలలో…భగవంతుడు లేని చీకటి దేవాలయమే కదా ఎంత బలం బలగం ఉన్నా ఏమి? అమ్మలేని జీవితం శూన్యమే కదా. ఇలాంటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్. తన అమ్మకట్టిన చీరంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.

శ్రీదేవి గారాల ప‌ట్టి జాన్వీ క‌పూర్ కూడా తాను చీర ధ‌రించిన ఫోటోని షేర్ చేశారు.  ఇది నాకు చాలా ఇష్టమైన మరియు ప్రత్యేకమైన చేనేత చీర… మన దేశంలో చేనేత మరియు చేతివృత్తులవారు నైపుణ్యం మరియు సృజనాత్మకత చాలా గొప్పది అంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన‌ది అంటూ పోస్ట్ పెట్టింది. తన తల్లిని ఓ సారి గుర్తు చేసుకుంది.