ఇటలీలో కరోనా మృత్యునాదం…

|

Mar 22, 2020 | 6:56 PM

ఇటలీలో స్వైర విహారం చేస్తోంది కరోనా. వైరస్‌ పుట్టిన చైనాను మించిపోయింది. అత్యంత వేగంగా విస్తరిస్తూ మారణహోమం సృష్టిస్తోంది. ఇప్పటివరకు చైనాలో 3వేల 261 మంది మృతి చెందగా..ఇటలీలో మాత్రం 4వేల 825కు చేరింది మృతుల సంఖ్య. ప్రతిరోజూ వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 793మంది కరోనా కాటుకు బలవగా..మరో 6వేల 557మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచస్థాయి మృతుల్లో ఇటలీలో మరణాలు 38.5శాతంగా ఉంది. ప్రముఖ నగరం మిలన్‌ సమీపంలోని ఉత్తర […]

ఇటలీలో కరోనా మృత్యునాదం...
Follow us on

ఇటలీలో స్వైర విహారం చేస్తోంది కరోనా. వైరస్‌ పుట్టిన చైనాను మించిపోయింది. అత్యంత వేగంగా విస్తరిస్తూ మారణహోమం సృష్టిస్తోంది. ఇప్పటివరకు చైనాలో 3వేల 261 మంది మృతి చెందగా..ఇటలీలో మాత్రం 4వేల 825కు చేరింది మృతుల సంఖ్య. ప్రతిరోజూ వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 793మంది కరోనా కాటుకు బలవగా..మరో 6వేల 557మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచస్థాయి మృతుల్లో ఇటలీలో మరణాలు 38.5శాతంగా ఉంది. ప్రముఖ నగరం మిలన్‌ సమీపంలోని ఉత్తర లోంబార్డీలోనే 3వేల మంది మృతి చెందారు.

గత 10రోజుల నుంచి ఇటలీ పూర్తిగా నిర్బంధంలోనే ఉంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అక్కడి పోలీసులు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. మార్నింగ్‌ వాక్‌కు కూడా బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రహెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులే కాదు. యువతపైనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని హెచ్చరించింది. కరోనా లక్షణాలు లేకపోయినా జాగ్రత్తగా ఉండాలని..ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.