Breaking News: హైదరాబాద్‌లో శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు బంద్!

|

Feb 27, 2020 | 2:53 PM

ఇంటర్ విద్యను కొన్నేళ్ళుగా శాసిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు తెలంగాణలో మూతపడనున్నాయా? ఇంటర్ బోర్డు తాజాగా తెలంగాణ హైకోర్టుకు నివేదించిన అఫిడవిట్‌లో ప్రస్తావించిన అంశాలు అదే చాటుతున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే అనుమతుల్లేని శ్రీచైతన్య, నారాయణ కాలేజీలను మూసివేసేందుకు ఇంటర్ బోర్డు సిద్దమవుతున్నట్లు సమాచారం.

Breaking News: హైదరాబాద్‌లో శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు బంద్!
Follow us on

Telangana High Court shocks Sri Chaitanya and Narayana colleges: హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది. ఇరుకు భవనాల్లో కాలేజీలు నిర్వహిస్తూ.. విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు చెలగాటమాడుతున్నాయని, అనుమతుల్లేని కాలేజీలను మూసి వేసేందుకు అనుమతించాలని కోర్టుకు నివేదించింది. అయితే, ఇప్పటికిప్పుడు మూసివేస్తే.. సుమారు 29 వేల 808 మంది విద్యార్థులకు ఇంటర్ పరీక్షల ముందు ఇబ్బంది పడతారని, అందుకే ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల మూసివేతకు అనుమతించాలని ఇంటర్ బోర్డు తెలంగాణ హైకోర్టును కోరింది.

గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కళాశాలలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. గుర్తింపులేని కళాశాలలపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ఇంటర్ బోర్డు… అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చామని హైకోర్టుకు తెలిపింది.

మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలున్నందున ఇప్పటికిప్పుడు కాలేజీలు మూసివేస్తే విద్యార్థులపై ప్రబావం పడుతుందని, వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటారని ఇంటర్ బోర్డు తమ అఫిడవిట్‌లో పేర్కొంది. గుర్తింపు లేని కాలేజీల్లో మొత్తం 29 వేల 808 మంది విద్యార్థులున్నారని తెలిపిన ఇంటర్ బోర్డు.. పరీక్షలు ముగిసిన వెంటనే కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని హైకోర్టును కోరింది. అగ్నిమాపక ఎన్ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలున్నాయని ఇంటర్ బోర్డు తెలిపింది. దాంతో తగిన చర్యలు తీసుకొని ఏప్రిల్ 3వ తేదీన నివేదిక సమర్పించాలని హైకోర్టు తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది.

Also read: Roja predicts Chandrababu’s future చంద్రబాబు భవిష్యత్తుపై రోజా జోస్యం