ఇండియాలో క‌రోనా టెర్ర‌ర్ : 23 ల‌క్ష‌లు దాటిన కేసులు

|

Aug 12, 2020 | 10:54 AM

ఇండియాలో కొవిడ్​ తీవ్ర‌త‌ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 60,963 మందికి వైరస్ సోకింది.

ఇండియాలో క‌రోనా టెర్ర‌ర్ : 23 ల‌క్ష‌లు దాటిన కేసులు
Follow us on

India Corona Cases : ఇండియాలో కొవిడ్​ తీవ్ర‌త‌ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 60,963 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23 లక్షల మార్కును దాటింది. మరో 834 మంది క‌రోనా కార‌ణంగా చ‌నిపోయారు.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ ప్రకారం దేశంలో కోవిడ్-19 వివ‌రాలు

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డ్డ‌వారు 23,29,639
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,43,948
వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 16,39,600
ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనాతో చ‌నిపోయినవారు 46,091

క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 56వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజంట్ దేశంలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 70శాతానికి చేరింది. డెత్ రేటు 1.99శాతంగా కొనసాగుతోంది.

 

 

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”