విశాఖ దుర్ఘటనపై కేంద్రం ఆరా..ఎన్డీఎమ్ఏతో మోదీ భేటీ

|

May 07, 2020 | 10:58 AM

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్య‌వ‌స‌ర భేటీ ఏర్పాఉట చేశారు. ఎన్డీఎమ్ఏతో చ‌ర్చించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతో మోడీ అత్యవసర భేటీ ఏర్పాటు చేయడం విశాఖ దుర్ఘటన తీవ్రతకు అద్దం పడుతోంది. విశాఖ గ్యాస్ దుర్ఘటన బాధితులకు సహాయం అందించడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై ప్ర‌త్యేకంగా భేటీలో చ‌ర్చించారు. ఇప్ప‌టికే, గ్యాస్ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ వివరాలను కోరింది. ఏపీ సీఎస్ […]

విశాఖ దుర్ఘటనపై కేంద్రం ఆరా..ఎన్డీఎమ్ఏతో మోదీ భేటీ
Follow us on

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్య‌వ‌స‌ర భేటీ ఏర్పాఉట చేశారు. ఎన్డీఎమ్ఏతో చ‌ర్చించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతో మోడీ అత్యవసర భేటీ ఏర్పాటు చేయడం విశాఖ దుర్ఘటన తీవ్రతకు అద్దం పడుతోంది. విశాఖ గ్యాస్ దుర్ఘటన బాధితులకు సహాయం అందించడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై ప్ర‌త్యేకంగా భేటీలో చ‌ర్చించారు.

ఇప్ప‌టికే, గ్యాస్ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ వివరాలను కోరింది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై మార్గదర్శకాలు ఇచ్చారు. పలు సూచనలు చేశారు. అస్వస్థతకు గురైన వారికి సత్వర చికిత్స అందించాల్సిందిగా సూచించారు. విశాఖకు ఎన్డీఆర్ఎప్ బృందాలను పంపాలని ఆదేశించారు.
కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. బాధితుల సంఖ్య క్షణక్షణానికీ పదుల సంఖ్యలో పెరుగుతోంది.  సంఘటన జరిగిన ఆర్ వెంకటాపురంలోనే ముగ్గురు మరణించగా, కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కేజీహెచ్ గ్యాస్ లీకేజీ బాధితులతో కిక్కిరిసిపోయింది.