ఏపీలో ఆగని అక్రమ మద్యం రవాణ..

|

Sep 11, 2020 | 11:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణ కొనసాగుతోంది. అక్రమ మద్యం రవాణను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా... ఫలితం లేకుండా పోతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాని జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు...

ఏపీలో ఆగని అక్రమ మద్యం రవాణ..
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణ కొనసాగుతోంది. అక్రమ మద్యం రవాణను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… ఫలితం లేకుండా పోతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాని జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా తెలంగాణ నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.33 వేల ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తనిఖీల్లో 24 మద్యం బాటిల్స్, మోటార్ సైకిల్, వ్యాన్ ను స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు తెలంగాణ నుంచి మద్యంను అక్రమ మార్గంలో తీసుకుని వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో సరిహద్దు జిల్లాలో అధిక రేటు అమ్ముకుంటున్నారని పోలీసులు తెలిపారు.