గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరణంపై ఆయన ప్రియ స్నేహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్పందించారు. ఆయన ఓ వీడియో ద్వారా తన దుఃఖాన్ని వెలిబుచ్చారు. ‘త్వరగా లేచిరా.. నిన్ను చూడటానికి నేను వేచి ఉన్నానని చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లావు. గంధర్వలోకంలో పాడటానికి వెళ్లావా.. ఇక్కడ ప్రపంచం శూన్యంగా మారిపోయింది. ప్రపంచంలో నాకేమీ తెలియడం లేదు. మాట్లాడటానికి మాటలు రావడం లేదు. చెప్పడానికి ఏమీ లేదు. ఏం చెప్పాలో తెలియడం లేదు. దుఃఖానికి ఓ హద్దు ఉంటుంది. కానీ నీవల్ల కలిగిన దుఃఖానికి హద్దే లేదు’ అన్నారు ఇళయరాజా.
#ilaiyaraaja expresses his grief over the demise of #SPBalasubrahmanyam garu #RIPSPB pic.twitter.com/IlBpqpItem
— BARaju (@baraju_SuperHit) September 25, 2020