AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్ర, తెలంగాణలో కుంభవృష్టి

తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వానకి రోడ్లు జలమయమయ్యాయి. కరెంట్ సరఫరా నిలిచపోయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ సహా ప్రముఖ నగరాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రకాశంజిల్లా గిద్దలూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీల్లోని ఇళ్ళల్లోకి నడుములోతు నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్ళల్లో ఉండలేక […]

ఆంధ్ర, తెలంగాణలో కుంభవృష్టి
Venkata Narayana
|

Updated on: Sep 26, 2020 | 8:21 AM

Share

తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వానకి రోడ్లు జలమయమయ్యాయి. కరెంట్ సరఫరా నిలిచపోయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ సహా ప్రముఖ నగరాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రకాశంజిల్లా గిద్దలూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీల్లోని ఇళ్ళల్లోకి నడుములోతు నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్ళల్లో ఉండలేక జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

లోతట్టు ప్రాంతాలు శ్రీనివాస ధియేటర్ ప్రాంతం, సత్య నారాయణ నగర్, ఖాదర్ వలీ దర్గా ప్రాంతాల్లోని వీధులు, ఇళ్ళు నీట మునిగాయి. వీధులన్నీ వాగులను తలపిస్తుండటంతో ఒకరినొకరు ఆసరాగా పట్టుకుని స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ఇళ్ళల్లోని వస్తువులు, సామాగ్రి అలాగే వదిలేసి వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. అటు, గిద్దలూరు నుంచి కడప జిల్లా కు వెళ్లే మార్గంలో వంతెన పై నుంచి నీటి ఉదృతి పెరగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షంతో ఏపీ, తెలంగాణలో పల్లె వాసులు నానా ఇక్కట్లు పడుతున్నారు.

Follow Us
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
బాహుబలి మూవీ స్థాయిలో.! ఆ స్టార్ హీరోతో చేసి ఉంటే..
బాహుబలి మూవీ స్థాయిలో.! ఆ స్టార్ హీరోతో చేసి ఉంటే..