‘కిమ్ ఏడీ ? ఎక్కడ ? మరణించే ఉంటాడు.’..అమెరికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరణించి ఉండకపోతే తాను షాక్ తింటానని  షాకింగ్ కామెంట్ చేశారు అమెరికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్. (అంటే కిమ్ మరణించే ఉంటాడని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు). కిమ్ విషయమై నార్త్ కొరియా రోజుకో కొత్త కథనాన్ని వెలువరిస్తోందని, ఎన్నో ప్రశ్నలు....

కిమ్ ఏడీ ? ఎక్కడ ? మరణించే ఉంటాడు...అమెరికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్

Edited By:

Updated on: Apr 26, 2020 | 4:30 PM

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరణించి ఉండకపోతే తాను షాక్ తింటానని  షాకింగ్ కామెంట్ చేశారు అమెరికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్. (అంటే కిమ్ మరణించే ఉంటాడని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు). కిమ్ విషయమై నార్త్ కొరియా రోజుకో కొత్త కథనాన్ని వెలువరిస్తోందని, ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, వాటికి సమాధానాలు రావలసిందేనని ఆయన అన్నారు. ట్రంప్ ప్రభుత్వ మాజీ సలహాదారుడైన గ్రాహమ్.. కిమ్ కు సంబంధించిన వార్తలపై ఎందుకింత అయోమయం ఏర్పడిందని ప్రశ్నించారు. కిమ్ మరణించి ఉంటాడనో లేదా తీవ్ర విషమ స్థితిలో ఉన్నాడనో జపాన్, హాంకాంగ్ లలోని మీడియాల్లో వరుసగా వార్తలు వస్తున్నాయి. కిమ్ ప్రయాణించే ప్రైవేట్ ట్రెయిన్ ఆయన తరచూ సందర్శించే వోన్సాన్ రిసార్ట్ సమీపంలో ఉన్న దృశ్యాన్ని శాటిలైట్లు ఫోటోలు తీశాయి. అటు-ఉత్తర కొరియాకు చైనా నుంచి కొందరు డాక్టర్లు కూడా వెళ్లారు.

కిమ్ చివరిసారి ఈ నెల 11 న పాలక వర్కర్స్ పార్టీ కమిటీ సమావేశంలో కనిపించాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై గతరాత్రి ఫాక్స్ న్యూస్ వెలువరించిన వార్తలను తాను నమ్ముతున్నానని లిండ్సే గ్రాహమ్ తెలిపారు. అతని హెల్త్ మీద ఎంతకాలం పరస్పర విరుధ్ధ  వార్తలను వింటామని ఆయన అన్నారు. కిమ్ మరణిస్తే నార్త్ కొరియా ప్రజలు కొంత ఊరట చెందుతారని, పైగా తమ దేశాధ్యక్షుడు ట్రంప్ కూడా కిమ్ వారసులు ఎవరైనా సరే.. వారితో కలిసి పని చేయడంపై ఆసక్తి చూపుతున్నారని ఆయన వెల్లడించారు. ట్రంప్ మాత్రం కిమ్ విషమ స్థితిలో ఉన్నట్టు వఛ్చిన వార్తలను దాదాపు కొట్టి పారేసిన సంగతి విదితమే. ఇక-హాంకాంగ్ శాటిలైట్ టెలివిజన్ వైస్ డైరెక్టర్ షిజియాన్ జింగ్ జౌ అయితే కిమ్ ఇదివరకే మరణించాడని తనకు గట్టి విశ్వసనీయవర్గాలు తెలిపాయని చెప్పారు.