ఫట్టుమన్న హైజీన్ కిట్టు

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:28 PM

ప్రభుత్వ విద్యాసంస్థల్లో 12 నుంచి 18ఏళ్ల లోపు, 7 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థినులకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేయాలని తెల౦గాణ ప్రభుత్వ౦ గతేడాది నిర్ణయించింది. దీంతో విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని భావించింది. అందులో భాగంగా ఏటా నాలుగు సార్లు హైజిన్‌ కిట్లను ఉచితంగా అందించాలని సంకల్పించింది. మొదటిసారి 2018 ఆగస్టులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు కిట్లను అందించింది. అందులో బాలికలకు అవసరమైన టూత్‌బ్రెష్‌, బాత్‌ సోప్‌, మూడు […]

ఫట్టుమన్న హైజీన్ కిట్టు
Follow us on

ప్రభుత్వ విద్యాసంస్థల్లో 12 నుంచి 18ఏళ్ల లోపు, 7 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థినులకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేయాలని తెల౦గాణ ప్రభుత్వ౦ గతేడాది నిర్ణయించింది. దీంతో విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని భావించింది. అందులో భాగంగా ఏటా నాలుగు సార్లు హైజిన్‌ కిట్లను ఉచితంగా అందించాలని సంకల్పించింది.

మొదటిసారి 2018 ఆగస్టులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు కిట్లను అందించింది. అందులో బాలికలకు అవసరమైన టూత్‌బ్రెష్‌, బాత్‌ సోప్‌, మూడు డిటర్జెంట్‌ సోప్స్‌, టంగ్‌ క్లీనర్‌, టూత్‌పేస్ట్‌ తల నూనె, షాంపో, కాటుక, ఫౌడర్‌, మూడు శానిటరీ నాప్‌కీన్స్‌ సెట్‌, నైలాన్‌ రబ్బరు బ్యాండ్‌,‌ దువ్వెన, బొట్టు బిల్లలు ఉన్నాయి. వీటి విలువ రూ.1,600 వరకు ఉంటుంది. మొదటి విడత కిట్లు పంపిణీ చేయడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పలువురు స్వాగతించారు. పేదరికంలో ఉన్న బాలికలకు ఈ పథకం వరంలా మారింది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది.