హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా దెబ్బకు స్వచ్ఛందంగా మూతపడ్డ మర్కెట్లు రేపటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. గత పదిరోజుల నుంచి ఈనెల 5 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించుకున్న బేగంబజార్, జనరల్ బజార్ మార్కెట్లు ఈ నెల 6 నుంచి సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని ది హైదరాబాద్ కిరాణా దుకాణాల సంఘం కార్యవర్గం వెల్లడించింది. పది రోజుల తర్వాత ఈ నెల 6 నుంచి మార్కెట్‌లోని అన్ని దుకాణాలను తెరవనున్నట్లు షాపు యాజమానులు తెలిపారు. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం నుంచి దుకాణాలు తెరిచినా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని షాపు యాజమానులు వెల్లడించారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించి రావాలని సూచిస్తున్నారు. ఇక ప్రతిరోజు మార్కెట్ పరిసరాలను శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.