ముగిసిన హుజూర్‌నగర్ ఉపఎన్నిక పోలింగ్ .. 82 శాతం ఓటింగ్ నమోదు

| Edited By:

Oct 21, 2019 | 6:50 PM

హుజూర్‌నగర్ ఉపఎన్నికల సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నియోజకవర్గంలోగల ఏడు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటలవరకు మొత్తం 82.23 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్ధులైన శానంపూడి సైదిరెడ్డి(టీఆర్ఎస్), ఉత్తమ్ పద్మావతి( కాంగ్రెస్),చావా కిరణ్మయి(టీడీపీ),కోట రామారావు(బీజేపీ) నుంచి పోటీ చేశారు. వీరితోపాటు మొత్తం 28 మంది అభ్యర్ధులు హుజూర్‌నగర్‌లో పోటీ పడ్డారు. హుజూర్‌నగర్ స్ధానం నుంచి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా […]

ముగిసిన హుజూర్‌నగర్ ఉపఎన్నిక పోలింగ్ .. 82 శాతం ఓటింగ్ నమోదు
Follow us on

హుజూర్‌నగర్ ఉపఎన్నికల సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నియోజకవర్గంలోగల ఏడు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటలవరకు మొత్తం 82.23 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్ధులైన శానంపూడి సైదిరెడ్డి(టీఆర్ఎస్), ఉత్తమ్ పద్మావతి( కాంగ్రెస్),చావా కిరణ్మయి(టీడీపీ),కోట రామారావు(బీజేపీ) నుంచి పోటీ చేశారు. వీరితోపాటు మొత్తం 28 మంది అభ్యర్ధులు హుజూర్‌నగర్‌లో పోటీ పడ్డారు.

హుజూర్‌నగర్ స్ధానం నుంచి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఈ స్ధానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ స్ధానంలో కాంగ్రెస్ తిరిగి హవా చాటాలని కాంగ్రెస్ పార్టీ, ఎలాగైనా పాగా వేయాలని టీఆర్ఎస్ పోటీ పడ్డాయి. మధ్యలో టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు కూడా నిలబడటంతో వీరికి పోలైన ఓట్లు ఎవరి ఓట్లు చీల్చాయనే దానిపైనే ఆయా అభ్యర్ధుల విజయం ఆధారపడి ఉంటుంది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అభ్యర్ధుల భవితవ్యం ఈ నెల 24న ఓట్ల లెక్కింపులో తేలనుంది.