గులాబీ శ్రేణుల్లో.. గుర్తుల టెన్షన్..?

| Edited By: Rajesh Sharma

Oct 04, 2019 | 5:45 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. పొలిటికల్‌ హీట్‌ను రాజేస్తోంది.. హుజూర్ నగర్ బై ఎలక్షన్స్. ప్రస్తుతం తెలంగాణలో వున్న మరో హాట్ టాపిక్ ఇదే. ఇప్పటికే హజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి ఎలక్షన్‌ షెడ్యూల్‌ని కూడా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే.. అక్టోబర్ 24నే ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ.. ఎలక్షన్ బరిలోకి దిగనున్న నేతల వివరాలు తెలియజేశాయి. దీంతో.. వారందరూ అప్పుడే […]

గులాబీ శ్రేణుల్లో.. గుర్తుల టెన్షన్..?
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. పొలిటికల్‌ హీట్‌ను రాజేస్తోంది.. హుజూర్ నగర్ బై ఎలక్షన్స్. ప్రస్తుతం తెలంగాణలో వున్న మరో హాట్ టాపిక్ ఇదే. ఇప్పటికే హజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి ఎలక్షన్‌ షెడ్యూల్‌ని కూడా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే.. అక్టోబర్ 24నే ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ.. ఎలక్షన్ బరిలోకి దిగనున్న నేతల వివరాలు తెలియజేశాయి. దీంతో.. వారందరూ అప్పుడే ప్రచారాలు కూడా మొదలు పెట్టేశారు.

కాగా.. ఇదంతా.. ఒక ఎత్తైతే.. ఇప్పుడు మరో సమస్య.. టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. గత ఎలక్షన్స్‌లో.. టీఆర్ఎస్‌కి ఓట్ల తగ్గడానికి.. అలాగే.. కోన్నిచోట్ల అభ్యర్థులు పరాజయమవడానికి కారణమయ్యాయని గులాబీ పార్టీ వర్గాలంటున్నాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్, ఆటో గుర్తులు తమ పార్టీని వెంటాడుతున్నాయని అంటున్నారు. అచ్చం కారు గుర్తులాగే ఉండి.. తమ ఓట్లకు గండికొట్టాయని వారు వాపోతున్నారు. ఇప్పుడు హుజూర్ నగర్ బై ఎలక్షన్స్‌లో కూడా అదే సమస్య నెలకొంది.

ప్రస్తుతం ఇప్పుడు బై ఎలక్షన్స్‌లో 28 మంది బరిలో ఉండగా.. వారిలో 24 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. మిగతా నలుగురు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిన వారు. ఆ తరువాత 5వ స్థానంలో.. ఇండిపెండెంట్ అభ్యర్థి.. మహేష్.. ట్రాక్టర్ గుర్తు ఉంది. దీంతో.. టీఆర్ఎస్‌ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతోన్నాయి. ప్రజలు ఏమాత్రం.. కన్‌ఫ్యూజ్ అయినా.. తమ ఓట్లు పోయే అవకాశమున్నందున ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే.. ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారట. కుదరని సమయంలో.. తమ పార్టీ గుర్తైన.. కారును.. మరింత ముదురు రంగులో ఉంచాలని.. వినతిపత్రం ఇచ్చారు ఎంపీ వినోద్ కుమార్. ఈ విషయంపై స్పందించిన ఎన్నికల సంఘం… కారు గుర్తును మార్చింది. కానీ.. మిగతా గుర్తులను మార్చలేమని స్పష్టం చేసింది. దీంతో.. టీఆర్‌ఎస్ పార్టీలో కలవరం మొదలైంది.