తొలిరోజే వందకోట్ల లిక్కర్.. పొంగిపొర్లిన మద్యం

|

May 06, 2020 | 6:34 PM

తెలంగాణలో మద్యం అమ్మకాలకు తెరలేచిన తొలిరోజే బంపర్ బిజినెస్ జరిగింది. మొదటి రోజునే వంద కోట్ల రూపాయల మద్యం విక్రయాలు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్ వర్గాల ప్రాథమిక అంచనాకు వచ్చాయి.

తొలిరోజే వందకోట్ల లిక్కర్.. పొంగిపొర్లిన మద్యం
Follow us on

తెలంగాణలో మద్యం అమ్మకాలకు తెరలేచిన తొలిరోజే బంపర్ బిజినెస్ జరిగింది. మొదటి రోజునే వంద కోట్ల రూపాయల మద్యం విక్రయాలు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్ వర్గాల ప్రాథమిక అంచనాకు వచ్చాయి. మార్చి 21న వైన్ షాపులు బంద్ అయ్యే నాటికి రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో మొత్తం 110 కోట్ల రూపాయల మద్యం వుందని అంఛనా వేశారు. గత నిల్వకు, బుధవారం డిపోల నుంచి కొనుగోలు చేసిన దానికి, బుధవారం అమ్మకాలు క్లోజ్ అయ్యే సమయానికి మిగిలిన మద్యం నిల్వలను పోలుస్తున్న ఎక్సైజ్ అధికారులు తొలిరోజునే సుమారు వంద కోట్ల రూపాయల లిక్కర్ సేల్ అయ్యిందని అంఛనా వేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మద్యం డిపోల దగ్గరి నుంచి భారీ ఎత్తున సేల్స్ జరిగాయి. మార్చి 21న షాపుల్లో 110 కోట్ల రూపాయల విలువైన మద్యం నిల్వ వుండింది. బుధవారం నాడు సుమారు 44 కోట్ల రూపాయల విలువైన మద్యం డిపోల నుంచి కొనుగోలు చేశారు. సుమారు లక్ష కేసుల బీరు డిపోల నుంచి వైన్సుషాపులు యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. పాత నిల్వ, బుధవారం డిపోల నుంచి కొనుగోలు చేసింది.. కలిపి బుధవారం తొలి రోజునే సుమారు వంద కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారని ఎక్సైజ్ సిబ్బంది అంఛనా వేస్తున్నారు.