తెలంగాణ కేబినెట్ విస్తరణపై టెన్షన్ టెన్షన్..

హైదరాబాద్: తెలంగాణలో మంత్రవర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు కేబినెట్‌ను సీఎం కేసీఆర్ విస్తరించబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రివర్గంలో మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. మహమూద్ అలీకి హోం శాఖ కేటాయించారు. అయితే బుధవారం 8 లేదా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇప్పటివరకు అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబల్లి దయాకరరావుకు మాత్రమే సీఎం కార్యాలయం నుంచి […]

తెలంగాణ కేబినెట్ విస్తరణపై టెన్షన్ టెన్షన్..

Edited By:

Updated on: Oct 12, 2020 | 4:55 PM

హైదరాబాద్: తెలంగాణలో మంత్రవర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు కేబినెట్‌ను సీఎం కేసీఆర్ విస్తరించబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రివర్గంలో మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. మహమూద్ అలీకి హోం శాఖ కేటాయించారు.

అయితే బుధవారం 8 లేదా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇప్పటివరకు అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబల్లి దయాకరరావుకు మాత్రమే సీఎం కార్యాలయం నుంచి సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది.

కానీ మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ లేదా పద్మారావుల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. అయితే గతంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావులకు పదవులు దక్కుతాయా లేదా? అనే విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఏది ఎలా జరిగినప్పటికీ బుధవారం జరగనున్న మంత్రివర్గం విస్తరణలో పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడబోదని, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాతనే పూర్తి కేబినెట్ కొలువుతీరనుందని సమాచారం.