అంతర్వేదిలో ఉద్రిక్తత.. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

|

Sep 08, 2020 | 1:51 PM

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ర్యాలీగా వెళ్తున్న ధార్మిక సంఘాల నేతలు, భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. దిండి బ్రిడ్జిపై పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు

అంతర్వేదిలో ఉద్రిక్తత.. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
Follow us on

Tensions high in Antarvedi  : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ర్యాలీగా వెళ్తున్న ధార్మిక సంఘాల నేతలు, భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. దిండి బ్రిడ్జిపై పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. శాంతియుతంగా ఆలయానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ధార్మిక సంఘాల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జైశ్రీరాం‌ అంటూ నినాదాలు చేశారు. వందలాది మంది ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నిప్రమాదంలో కాలిపోవడం పెను కలకలం రేపింది. ఈ ఘటనలో స్వామివారి రథం మంటల్లో దగ్ధమైంది. ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఈ పని చేశారని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఇది ప్రమాదమా లేక ఏదైనా కుట్రకోణం ఉందా అని తేల్చేందుకు ఓ కమిటీని కూడా వేసింది. కాసేపట్లో అంతర్వేది దేవస్థానంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెల్లుబోయిన వేణు పరిశీలించనున్నారు. ఇంతలో ధార్మిక సంఘాల నేతలు ర్యాలీగా తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.