AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఏపీ డీజీపీకి అమరావతి హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీ గౌతమ్ సావంగ్‌కు అమరావతి హైకోర్టు షాకిచ్చింది. ఫిబ్రవరి 14న హైకోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఈ మేరకు బుధవారం స్పందించింది. రెండ్రోజుల గడువుతో హైకోర్టుకు హాజరు కావాలని నిర్దేశించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ […]

Breaking: ఏపీ డీజీపీకి అమరావతి హైకోర్టు షాక్
Rajesh Sharma
|

Updated on: Feb 12, 2020 | 1:55 PM

Share

ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీ గౌతమ్ సావంగ్‌కు అమరావతి హైకోర్టు షాకిచ్చింది. ఫిబ్రవరి 14న హైకోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఈ మేరకు బుధవారం స్పందించింది. రెండ్రోజుల గడువుతో హైకోర్టుకు హాజరు కావాలని నిర్దేశించింది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయవిచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేశారు.

విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?