ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక ప్రతిపాదనలకు నిర్ణయం

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటువేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మార్చి 15 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని అయన తెలిపారు. నోటిఫికేషన్ నుంచి 15 రోజులలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తేనున్నారు. ఎన్నికల్లో డబ్బుతో, మద్యంతో అభ్యర్థులు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. సర్పంచ్ లకే పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు […]

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక ప్రతిపాదనలకు నిర్ణయం
TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 12, 2020 | 2:16 PM

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటువేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మార్చి 15 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని అయన తెలిపారు. నోటిఫికేషన్ నుంచి 15 రోజులలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తేనున్నారు. ఎన్నికల్లో డబ్బుతో, మద్యంతో అభ్యర్థులు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. సర్పంచ్ లకే పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు అప్పగించనున్నారు. స్థానిక నివాసం ఉన్నవారికే సర్పంచ్ పదవికి అర్హులని పేర్ని నాని ప్రకటించారు. నేరాలకు పాల్పడితే గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలుశిక్ష విధించనున్నారు.

ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తెలిపింది. జెన్కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగులు ఇవ్వాలని కేబినెట్‌ భేటీలో ప్రతిపాదించనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వనున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్  ఏర్పాటుకు కాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలకు 5 రోజులు మాత్రమే ప్రచారం నిర్వహించాలని పేర్ని నాని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 8 రోజులు ప్రచారం నిర్వహించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు గిరిజనులే అర్హులని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu