అమ్మాయిలందరికీ గ్రాడ్యుయేషన్‌తో పాటే పాస్‌పోర్ట్‌..!

|

Jul 12, 2020 | 4:09 PM

డిగ్రీ చదివిన అమ్మాయిలకు బంపర్ ఆఫర్ తీసుకువస్తోంది హర్యానా సర్కార్. ఆ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయిలందరికీ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌తో పాటే పాస్‌పోర్ట్‌ కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌ ప్రకటించారు.

అమ్మాయిలందరికీ గ్రాడ్యుయేషన్‌తో పాటే పాస్‌పోర్ట్‌..!
Follow us on

డిగ్రీ చదివిన అమ్మాయిలకు బంపర్ ఆఫర్ తీసుకువస్తోంది హర్యానా సర్కార్. ఆ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయిలందరికీ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌తో పాటే పాస్‌పోర్ట్‌ కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌ ప్రకటించారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించి ప్రాసెస్‌ మొత్తం కాలేజ్‌లోనే పూర్తి చేసి పాస్‌పోర్ట్‌ అందిచనున్నట్లు తెలిపారు. హెల్మెట్‌ ఫర్‌‌ ఎవరీ హెడ్‌ అనే కార్యక్రమానికి హాజరైన ఖట్టర్.. ఈ ప్రకటన చేశారు. యువతకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించాలన్న ఆయన.. ప్రతి స్టూడెంట్‌కి కాలేజీల్లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చేలా ఫ్లాన్ చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే, ఆడ పిల్లల సంరక్షణకు హర్యానా ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందన్న సీఎం.. భేటీ బచావో, భేటీ పడావో లాంటి కార్యక్రమాలు హర్యానాలో పక్కాగా అమలు చేస్తున్నామని సీఎం ఖట్టర్ అన్నారు.