కేటీఆర్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

హైదరాబాద్ నగర శివారుల్లో తెలంగాణ మంత్రి కేటీ రామారావు లీజుకు తీసుకున్న ఫామ్ హౌజ్ వ్యవహారంపై శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. జీవో 111కు విరుద్దంగా ఫామ్ హౌజ్ నిర్మాణం జరిగిందన్న ఫిర్యాదులపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీ రామారావుకు...

కేటీఆర్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
Follow us

|

Updated on: Jun 05, 2020 | 1:43 PM

హైదరాబాద్ నగర శివారుల్లో తెలంగాణ మంత్రి కేటీ రామారావు లీజుకు తీసుకున్న ఫామ్ హౌజ్ వ్యవహారంపై శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. జీవో 111కు విరుద్దంగా ఫామ్ హౌజ్ నిర్మాణం జరిగిందన్న ఫిర్యాదులపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీ రామారావుకు, రాష్ట్ర పీసీబీకి, హెచ్ఎండీఏకు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. 111 జీవోకు విరుద్ధంగా ఫామ్ హౌజ్ నిర్మాణం జరిగిందంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

సెంట్రల్ ఎన్విరాన్మెంట్ రిజిస్ట్రీ ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ పిసిబి, జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, హెచ్ఎండిఎ, రంగారెడ్డి కలెక్టర్ నేతృత్వంలో ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, మంత్రి కేటీఆర్ ఈ ఫామ్ హౌజ్‌ను లీజుకు తీసుకున్నారు. దీని నిర్మాణానికి మంత్రికి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.