జీహెచ్ఎంసీకి డిజిటల్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్: ఇప్పటికే పలుమార్లు మంచి పేరు తెచ్చుకున్న జీహెచ్‌ఎంసీకి మరో అవార్డు దక్కింది. పారదర్శక సేవల్లో భాగంగా అందిస్తోన్న సాంకేతిక సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) బల్దియాకు జాతీయ స్థాయిలో డిజిటల్ ఇండి యా అవార్డు ప్రకటించింది. పౌర సేవల్లో సాంకేతికతను వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నందుకుగాను పురస్కారం దక్కిందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పౌర సమస్యల పరిష్కారంలో భాగం గా ఫిర్యాదుల స్వీకరణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ ద్వారా […]
హైదరాబాద్: ఇప్పటికే పలుమార్లు మంచి పేరు తెచ్చుకున్న జీహెచ్‌ఎంసీకి మరో అవార్డు దక్కింది. పారదర్శక సేవల్లో భాగంగా అందిస్తోన్న సాంకేతిక సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) బల్దియాకు జాతీయ స్థాయిలో డిజిటల్ ఇండి యా అవార్డు ప్రకటించింది. పౌర సేవల్లో సాంకేతికతను వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నందుకుగాను పురస్కారం దక్కిందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పౌర సమస్యల పరిష్కారంలో భాగం గా ఫిర్యాదుల స్వీకరణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ ద్వారా వచ్చిన రెండు లక్షల ఫిర్యాదులను గతేడాది పరిష్కరించారు.
ఏడు లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో యాప్‌ను వినియోగించుకునే నగరం ఏదీ లేదని, అందుకే కేంద్రం అవార్డుకు ఎంపిక చేసిందని అధికారులు చెబుతున్నారు. యాప్‌తోపాటు ఆన్‌లైన్‌లో నిర్మాణ అనుమతుల జారీ, పన్నుల వసూలు, వాతావరణ వివరాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు, స్వచ్ఛతా సమస్యలకూ సాంకేతికత వినియోగిస్తున్నారు. ఈ మేరకు ఎన్‌ఐసీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మ ఆహ్వానం పంపింది. ఐటీ అదనపు కమిషనర్ ముషారఫ్ అలీని డిజిటల్ అవార్డు ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ అవార్డు అందజేయనున్నారు. జీహెచ్‌ఎంసీకి డిజిటల్ అవార్డు రావడంపై మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ దానకిషోర్ హర్షం వ్యక్తం చేశారు.